Amalapuram: తాండవపల్లిలో విధి నిర్వహణలో ఉన్న లైన్‌మెన్‌పై మూకుమ్మడి దాడి!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ వివాదంలో విధి నిర్వహణలో ఉన్న జూనియర్ లైన్‌మెన్ మట్టపర్తి వెంకట ఫణీంద్రపై మూకుమ్మడి దాడి.

SURESH, AMALAPURAM
Published on: 7 Nov 2026 1:20 PM IST
Amalapuram
X

Amalapuram: తాండవపల్లిలో విధి నిర్వహణలో ఉన్న లైన్‌మెన్‌పై మూకుమ్మడి దాడి!

Amalapuram: అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న జూనియర్ లైన్మెన్ మట్టపర్తి వెంకట ఫణీంద్ర పై కొందరి వ్యక్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో తలెత్తిన వివాదంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

లైన్మెన్ అదే గ్రామంలో మరోచోట విద్యుత్ పనులు చేస్తున్నాడు.అక్కడికి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వెళ్లి తమ ప్రాంతానికి తెచ్చిన కొత్త ట్రాన్స్ఫార్మర్ ను పెట్టాలంటూ పట్టుబట్టారు.ఇక్కడ చేస్తున్న పని మధ్యలో వదిలేసి వస్తే ఇక్కడ వారు నిలదీస్తారని, ఇది పూర్తయిన వెంటనే వస్తానని లైన్మెన్ బాదులిచ్చాడు.దాంతో ఇటు లైన్మెన్, అక్కడికి వచ్చిన వారికి మధ్య మాటల మీద యుద్ధం చోటుచేసుకుంది.

ఇంతలో కొందరు ఆవేశంగా లైన్మెన్ ఫణీంద్రంపై దాడికి పాల్పడ్డారు.గాయాల పాలైన జూనియర్ లైన్మెన్ ను తోటి ఉద్యోగులు అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో లైన్మెన్ చికిత్స పొందుతున్నాడు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM