Chintapalli: గంజాయి మత్తులో 5 నెలల పసిబిడ్డను కడతేర్చిన కన్నతండ్రి!
Chintapalli: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో గంజాయి మత్తులో కన్నతండ్రే 5 నెలల పసిబిడ్డను అతి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన కలకలం రేపింది.
Chintapalli: గంజాయి మత్తులో 5 నెలల పసిబిడ్డను కడతేర్చిన కన్నతండ్రి!
Chintapalli: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. మత్తు మహమ్మారి ఓ నిండు నూరేళ్ల పసిప్రాణాన్ని బలితీసుకుంది. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ కన్నతండ్రి తన ఐదు నెలల పసిగుడ్డును అతి కిరాతకంగా హతమార్చాడు.
స్థానికుల కథనం ప్రకారం బాబు తల్లి జీవనోపాధి కోసం స్థానిక హోటల్‌లో పనికి వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి తండ్రి గొల్లూరు చందు వద్దే ఉన్నాడు. బాబు ఆకలితో ఏడుస్తుండటంతో, చందు అతడిని తల్లి పనిచేస్తున్న హోటల్ వద్దకు తీసుకెళ్లి పాలు పట్టించాడు. అనంతరం బాబును తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
అయితే కొద్దిసేపటికే తీవ్ర గంజాయి మత్తులోకి జారుకున్న చందు, విచక్షణ మరిచి ఏమీ తెలియని ఐదు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా కడతేర్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్నతండ్రే కాలయముడిగా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.




