Blue Drum Murder Case: బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష
Blue Drum Murder Case: సంచలనం సృష్టించిన బ్లూడ్రమ్ము హత్య కేసులో మీరట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్తను చంపిన భార్య, ప్రియుడికి ఉరిశిక్ష ఖరారైంది.
Blue Drum Murder Case: బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష
Blue Drum Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త 'బ్లూడ్రమ్ము హత్య కేసు'లో స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో కట్టుకున్న భర్తను అత్యంత క్రూరంగా హతమార్చిన భార్యకు, ఆమె ప్రియుడికి మీరట్ జిల్లా కోర్టు మరణశిక్ష (ఉరిశిక్ష) ఖరారు చేసింది. నేరం రుజువు కావడంతో విచారణ పూర్తి చేసుకున్న సెషన్స్ న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా ఈ మేరకు తుది తీర్పును ప్రకటించారు.
అసలు ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌కు, ముస్కాన్ రస్తోగితో 2016లో వివాహం జరిగింది. అయితే, సౌరభ్ స్నేహితుడైన సాహిల్ శుక్లాతో ముస్కాన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ బంధానికి సౌరభ్ అడ్డుగా మారుతున్నాడనే అక్కసుతో భార్యాభర్తలిద్దరూ కలిసి దారుణమైన కుట్ర పన్నారు. 2025 మార్చి 4న సౌరభ్‌కు భోజనంలో నిద్రమాత్రలు కలిపిచ్చి మత్తులోకి జార్చారు. ఆ తర్వాత ప్రియుడు సాహిల్‌తో కలిసి ముస్కాన్ తన భర్తను అతి కిరాతకంగా హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి, సిమెంట్ నింపిన ఒక నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో (బ్లూడ్రమ్ము) దాచిపెట్టి మనాలీకి పరారయ్యారు.
కోర్టు తీర్పు & కుటుంబ సభ్యుల ఆవేదన:
కొన్ని రోజులుగా సౌరభ్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా ఈ దారుణ వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా హతుడి తల్లి రేణు రాజ్‌పుత్ కన్నీటిపర్యేంతమయ్యారు. మరో విశేషమేమిటంటే, హంతకురాలైన ముస్కాన్ తల్లిదండ్రులు సైతం తమ కుమార్తె చేసిన తప్పుకు కఠిన శిక్షే వేయాలని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. నేరం తీవ్రతను బట్టి ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.




