Singarayakonda: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి!

Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2026 4:10 PM IST
Singarayakonda
X

Singarayakonda: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి!

Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

మృతదేహాలను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తిరుపతి అర్బన్‌ పరిధిలోని మంగళం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా తిరుపతి కొండపై కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్