Madanapalle: అంగిశెట్టిపల్లి సర్పంచ్ అభ్యర్థి శేఖర్ రెడ్డి విస్తృత ప్రచారం!

Madanapalle: మదనపల్లె అంగిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మొపూరి రెడ్డి శేఖర్ రెడ్డి వైసీపీ మద్దతుతో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 25 Nov 2026 12:53 PM IST
Madanapalle
X

Madanapalle: అంగిశెట్టిపల్లి సర్పంచ్ అభ్యర్థి శేఖర్ రెడ్డి విస్తృత ప్రచారం!

Madanapalle: అంగిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థి మొపూరి రెడ్డి శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ వైసీపీకి మద్దతుగా తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా పాల్గొని అన్నకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle