Palamanda: భాను ప్రకాష్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు..వైఎస్సార్‌సీపీ నేతలు!
Palamanda: పాలమందలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి.
Palamanda: భాను ప్రకాష్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు..వైఎస్సార్‌సీపీ నేతలు!
Palamanda: పాలమందలో నిర్వహించిన వైసీపీ సీనియర్ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి పెద్దకర్మ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గం వైసీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి(హర్ష), ప్రవీణ్ కుమార్ రెడ్డి, పాల్గొన్నారు. భాను ప్రకాష్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. భాను ప్రకాష్ రెడ్డి మృతి వైసీపీకి తీరని లోటని, ఆయన మరణం పార్టీకి తీవ్ర నష్టమని అన్నారు. పార్టీ కోసం ఆయన అందించిన సేవలు, నాయకులు మరియు కార్యకర్తలతో ఆయన కొనసాగించిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాబా అమర, కౌశిక్ రెడ్డి, దీపక్, పూర్ణ, శివ, సిద్ధ గణేష్, కళ్యాణ్, ప్రసాద్ తదితరులు పాల్గొని భాను ప్రకాష్ రెడ్డికి నివాళులర్పించారు.




