Punganur: పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి అప్రజాస్వామికం!

Punganur: పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నాయకుల దాడిని సత్యసాయి జిల్లా నల్లచెరువు వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రవికుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 17 Oct 2026 4:02 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి అప్రజాస్వామికం!

Punganur: సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలో వైసీపీ నేతలతో కలిసి స్థానిక మండల కన్వీనర్ రవికుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పుంగనూరులో నిన్నటి రోజు వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు భౌతిక దాడికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్యయుతంగా నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్తున్న ఎంపీ కాన్వాయ్‌పై ప్రత్యర్థులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేకనే టీడీపీ నాయకులు ఇటువంటి అణచివేత చర్యలకు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్ష నాయకులు, అభ్యర్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు పక్షపాత వైఖరి వీడి, దాడికి పాల్పడిన అసలు దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రవికుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI