Kuppam: కుప్పంలో కన్నీటిపర్యంతమైన వైసీపీ నేత సీపీ మనోహర్

Kuppam: కుప్పంలో టీడీపీ నేత కాణిపాకం వెంకటేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రూ.1.25 కోట్ల పనుల బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని వైసీపీ నేత సీపీ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.

KUMAR, KUPPAM
Published on: 26 Oct 2026 11:49 PM IST
Kuppam
X

Kuppam: కుప్పంలో కన్నీటిపర్యంతమైన వైసీపీ నేత సీపీ మనోహర్

Kuppam: కుప్పంలో మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమైన వైసీపీ నేత సీపీ మనోహర్.. టీడీపీ నేత కాణిపాకం వెంకటేష్ నుండి నాకు ప్రాణహాని ఉంది.. తమకు చెందిన జల్లి ఫ్యాక్టరీ నుండి నెలకు రూ.1.25 లక్షలు వసూలు చేశారంటూ కాణిపాకం వెంకటేష్‌ పై మనోహర్ ఆరోపణలు.. మున్సిపాలిటీలో రూ. 1.25 కోట్ల అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించండి.

బిల్లుల కోసం కార్యాలయానికి వెళ్తే కమీషన్ అడుగుతున్నారని ఆరోపణ.. వైసీపీ జెండా ఎత్తితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు.. తనను వేధిస్తున్నారని కాణిపాకం వెంకటేష్‌ పై మనోహర్ ఆరోపణలు.. తమ నగలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రోడ్లు వేశామని ఆవేదన.

అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకపోతే డీఈ, ఏఈలపై కోర్టులో కేసు వేస్తానని హెచ్చరిక.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించి తనను రక్షించాలని వైసీపీ నేత సీపీ మనోహర్ విజ్ఞప్తి.. ఎన్ని కోట్లు పోయినా పార్టీ మారనని స్పష్టం.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM