Pileru: కార్యకర్తలే పార్టీకి బలం: గడికోట శ్రీకాంత్ రెడ్డి!
Pileru: అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన వైఎస్సార్సీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Pileru: కార్యకర్తలే పార్టీకి బలం: గడికోట శ్రీకాంత్ రెడ్డి!
అన్నమయ్య జిల్లా పీలేరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తల సమిష్టి సహకారంతో పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను పూర్తి చేసుకున్నామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారంనాడు పీలేరులో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఐడీ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు పార్టీపై ఉన్న హక్కుకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
త్వరలోనే గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఐడీ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిలాంటిదని, కష్టకాలంలో కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే అన్ని ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పేదలకు కొత్త ఇళ్లను మంజూరు చేయలేదని, నిరుద్యోగ భృతి అమలు చేయలేదని ఆరోపించారు.
50 ఏళ్లకే పెన్షన్, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 తదితర హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. మొదటి ఏడాది రైతు భరోసాను కూడా ఎగరగొట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఎక్కువ ప్రాజెక్టులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలోనే పునాది పడిందని, వాటిలో అనేక ప్రాజెక్టులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు.కార్యకర్తల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి కష్టాల్లో తోడుగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
కార్యకర్తల కోసం అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేసి, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ లు చింతల రామచంద్రా రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి,మదనపల్లె ఇంచార్జి నిస్సార్ అహమ్మద్ తదితర జిల్లా వ్యాప్తంగా నాయకులు ,రాష్ట్ర కమిటీ , జిల్లా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




