Chittoor: చిత్తూరు 45వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సల్మా నామినేషన్!
Chittoor: చిత్తూరు నగరపాలక సంస్థ 45వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా సల్మా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Chittoor: చిత్తూరు 45వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సల్మా నామినేషన్!
Chittoor: చిత్తూరు నగరం లోని 45వ డివిజన్ లో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనకు ఓటు వేయాలని వైకాపా అభ్యర్థి సల్మా పేర్కొన్నారు.నగరం లోని కన్నయ్య నాయుడు కాలనీ లో గల స్వర్ణ సచివాలయంలో 45వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా సల్మా నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గత వైకాపా పాలనలో 2019 నుంచి 2024 వ సంవత్సరం వరకు స్థానిక డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేశామని .... డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.స్థానిక ప్రజలు తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సల్మా విజ్ఞప్తి చేశారు.తనకు వైకాపా అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జి విజయానంద రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.




