Puthalapattu: యువత భవితకు భరోసా: ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్యే మురళీ మోహన్
Puthalapattu: పీ.కొత్తకోట వేము కాలేజీలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’లో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పాల్గొన్నారు.
Puthalapattu: యువత భవితకు భరోసా: ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్యే మురళీ మోహన్
Puthalapattu: ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం, పీ.కొత్తకోట లోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు గారితో కలిసి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గారు పాల్గొన్నారు.
కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారి ఉజ్వల భవిష్యత్తుపై భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాన్ని, APPSC గ్రూప్-1 నియామకాల్లో జరిగిన రూ.150 కోట్ల భారీ కుంభకోణాన్ని తీవ్రంగా ఖండించారు. జవాబు పత్రాలను సైతం ప్రైవేట్ రిసార్టులకు తరలించి, 97% కి పైగా పత్రాలలో అనధికార దిద్దుబాట్లకు పాల్పడి, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న తీరును అభ్యర్థులకు వివరించారు.
ఇలాంటి అక్రమాలకు చరమగీతం పాడుతూ.. మన కూటమి (NDA) ప్రభుత్వం కేవలం ప్రతిభ ఆధారంగా, అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతుందని, నిరుద్యోగుల కలలను నిజం చేసేందుకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గారు విద్యార్థులకు పూర్తి నమ్మకాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.




