Chittoor: రాజకీయంలో మహిళల సత్తా.. స్థానిక పోరులో ఏకగ్రీవ విజయాలు!

Chittoor: చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలు సత్తా చాటారు 5 జడ్పీటీసీ స్థానాల్లో 3 స్థానాలను మహిళా నాయకురాళ్లు ఏకగ్రీవంగా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు

VASU, PUTTALAPATTU
Updated on: 30 Oct 2026 11:38 AM IST
Chittoor
X

Chittoor: రాజకీయంలో మహిళల సత్తా.. స్థానిక పోరులో ఏకగ్రీవ విజయాలు!

Chittoor: మహిళలు మహా రాణులు అన్నట్లుగా పూతలపట్టు నియోజకవర్గం లో ఐదు జడ్పిటిసి స్థానాలు ఉండగా అందులో మూడు జడ్పిటిసి స్థానాలను మహిళలు ఏకగ్రీవంగా నెగ్గి మహిళా మహా రాణులు అనిపించుకున్నారు.

పూతలపట్టు జడ్పిటిసి సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శైలజ తేజోమూర్తి విద్యారంగములలో అగ్రగామిగా నిలిచారు. బంగారు పాల్యం జడ్పిటిసి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సుచిత్ర జయప్రకాశ్ నాయుడు అనేక రాజకీయ పదవులు పొంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారు. యాదమరి జడ్పిటిసి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మొరార్జీ యశోదమ్మ రాజకీయ పదవులు పొంది నిత్యం ప్రజలతో ఉన్నవారు.

నేడు అన్ని రంగాలలో మగవారితో పాటు పోటీపడి మహిళలంటే ఏమిటో నిరూపించుకోవడం చూస్తూనే ఉంటాం పూతలపట్టు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించే దానికి వీరు ఎంతో కృషి చేస్తారని ప్రజల నమ్మకం.

గ్రామాలలో నెలకొన్న పరిసరాల పరిశుభ్రత త్రాగునీటి సమస్య మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యల పైన ముఖ్యంగా దృష్టి సారించాలని మహిళలు ప్రజలు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్ కల్పించి నందుకు మహిళలు హర్షం వెలుబుచ్చారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU