Madanapalle: మదనపల్లెలో ఆరో రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె!

Madanapalle: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్ల సాధన కోసం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె ఆరో రోజుకు చేరింది.

Srinivasulu, Madanapalle
Published on: 21 Sept 2026 2:20 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ఆరో రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె!

Madanapalle: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లె మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె ఆరో రోజుకు చేరింది. మదనపల్లె మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వోలు, అటెండర్లు, వాచ్‌మెన్లు, రికార్డు అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సిరివెళ్ల గురు ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు ఆవుల రమణ, రెడ్డప్ప, శాంతకుమార్, నాన్సీ, ఉష, గౌసియా, భాగ్యమ్మతో పాటు పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle