Chittoor: చిత్తూరు కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
Chittoor: చిత్తూరు కలెక్టరేట్ వివేకానంద భవన్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారులు, సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు.
Chittoor: చిత్తూరు కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
చిత్తూరు: చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ వివేకానంద భవన్ లో బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాషా ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంఘ జిల్లా అధ్యక్షులు దయానందాచారి, సురేష్ బాబు ఆచారి మాట్లాడుతూ చేతి వృత్తులకు సంబంధించి చేతి వృత్తికారులకు దేశవ్యాప్తంగా గుర్తింప తెచ్చిన వ్యక్తి విశ్వ కర్మ మహర్షి అని, ఆయనను స్మరించుకుంటూ చేతివృత్తుల వారు ప్రతి ఏడాది అధికారికంగా విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు, జనరల్ సెక్రెటరీ కుమారేషన్, సంఘ నాయకులు పాల్గొన్నారు.




