Puthalapattu: రాజకీయాల్లోకి విజయం విద్యాసంస్థల అధినేత శైలజ తేజోమూర్తి అడుగు!
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు జడ్పీటీసి బరిలో విజయం విద్యాసంస్థల అధినేత భార్య శైలజ తేజోమూర్తి నిలిచారు.
Puthalapattu: రాజకీయాల్లోకి విజయం విద్యాసంస్థల అధినేత శైలజ తేజోమూర్తి అడుగు!
Puthalapattu: విజయం విద్యాసంస్థలో అఖండ విజయం సాధించి రాజకీయాల్లో శైలజ తేజో మూర్తి తొలి అడుగు వేయడం పూతలపట్టు మండలంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. జడ్పీ చైర్ పర్సన్ పీఠం శైలజ మూర్తికే వరుస్తుందని రాజకీయ వర్గాలు ద్వారా తెలిసి వచ్చింది.
విజయం విద్యా సంస్థలు అధినేత డాక్టర్ మందలపు తేజో మూర్తి సతీమణి శైలజ మూర్తి పూతలపట్టు జడ్పిటిసి అభ్యర్థిగా అధిష్టానం ఆదేశంతో ఆమెకు పూతలపట్టు జడ్పిటిసి అభ్యర్థిగా ఆమెను వరించింది. చిత్తూరుజడ్పీ చైర్ పర్సన్ మహిళలకు కేటాయించడంతో ఆఖరి క్షణంలో శైలజ మూర్తి పేరు ఖరారు అయింది.
పూతలపట్టు లోని విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్ తేజోమూర్తి నివాసంలో పూతలపట్టు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. జడ్పీ పీఠం దక్కే విధంగా రాజకీయాల్లో సమీకరణలు మారాయి అని రాజకీయ పెద్దలు అండదండలతో విజయం సాధించారు.
విద్యా సంస్థల అధినేత మందలపు మందలపు తేజ మూర్తికి పార్టీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు జడ్పీ చైర్పర్సన్ విషయంలో తెరపైకి కనిపిస్తూ వచ్చిన పేర్లన్నీ రాజకీయ సమీకరణలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.




