Madanapalle: విజయభారతి అధినేత సేతుకు జన్మదిన శుభాకాంక్షలు!
Madanapalle: అన్నమయ్య మదనపల్లెలో విజయభారతి విద్యాసంస్థల అధినేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎన్. సేతుకు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: విజయభారతి అధినేత సేతుకు జన్మదిన శుభాకాంక్షలు!
Madanapalle: విజయభారతి విద్యాసంస్థల అధినేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎన్. సేతు జన్మదినాన్ని పురస్కరించుకుని కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, తో పాటు బిల్డర్ మురళి, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్, బుల్లెట్ షఫీ, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పసుపులేటి చలపతి మాట్లాడుతూ, విద్యారంగంలో డాక్టర్ ఎన్. సేతు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, నాణ్యమైన విద్యను అందించడంలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. విద్యారంగంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజాసేవలోనూ మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు. డాక్టర్ ఎన్. సేతు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.




