Madanapalle: చైత్ర బిల్డర్స్ యజమాని రవితేజను నిలదీసిన బాధితులు!
Madanapalle: ఆర్థిక మోసాల ఆరోపణలపై చైత్ర బిల్డర్స్ యజమాని రవితేజను బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్ ఎదుట నిలదీసి, డబ్బులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Madanapalle: చైత్ర బిల్డర్స్ యజమాని రవితేజను నిలదీసిన బాధితులు!
మదనపల్లె: మదనపల్లె ఆర్థిక మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చైత్ర బిల్డర్స్ యజమాని రవితేజను బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్ ఎదుట నిలదీశారు. తమ కష్టార్జితాన్ని తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
బాధితులకు వెంటనే డబ్బులు తిరిగి చెల్లించాలని, ఉద్యోగులకు బకాయి వేతనాలు అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేశారు.




