Madanapalli: మదనపల్లిలో ఘనంగా ప్రముఖ నటి రామప్రభ 81వ జన్మదిన వేడుకలు!
Madanapalli: మదనపల్లిలో ప్రముఖ సినీ నటి రామప్రభ 81వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Madanapalli: మదనపల్లిలో ఘనంగా ప్రముఖ నటి రామప్రభ 81వ జన్మదిన వేడుకలు!
Madanapalli: ప్రముఖ సినీ నటి రామప్రభ 81వ జన్మదిన వేడుకలు సోమవారం మదనపల్లిలోని ఆమె స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైజాగ్ సత్యతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు హాజరై రామప్రభకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మోహనవల్లి రచించిన ‘రామప్రభ ఇదేనండి నా కథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహనవల్లి మాట్లాడుతూ రామప్రభ సినీ జీవితం ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 104కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆమెకు దక్కిందన్నారు. పలువురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ప్రత్యేకత కూడా రామప్రభకు ఉందని కొనియాడారు. ఇంతటి ప్రముఖ నటి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ రాధిక, పలువురు ప్రొఫెసర్లు, రామప్రభ అభిమానులు పాల్గొన్నారు.




