Madanapalle: మదనపల్లె జెడ్పీ హైస్కూల్‌కు వాసవి క్లబ్ ఫ్యాన్ల వితరణ!

Madanapalle: మదనపల్లె కొత్త ఇండ్లు జెడ్పీ హైస్కూల్‌కు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రూ.12 వేల విలువైన 6 సీలింగ్ ఫ్యాన్లను వితరణ చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 30 Sept 2026 4:50 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె జెడ్పీ హైస్కూల్‌కు వాసవి క్లబ్ ఫ్యాన్ల వితరణ!

Madanapalle: మదనపల్లె కొత్త ఇండ్లు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వాసవి క్లబ్ మదనపల్లె ఆధ్వర్యంలో ఆరు సీలింగ్ ఫ్యాన్లను వితరణ చేశారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు సహాయ సహకారాలు అందించాలని ప్రధానోపాధ్యాయురాలు విష్ణుప్రియ రెడ్డి వాసవి క్లబ్ సభ్యులను కోరగా, క్లబ్ ప్రెసిడెంట్ వీవీ కృష్ణారావు మరియు సభ్యులు స్పందించారు. ఇందులో భాగంగా రూ.12 వేల విలువైన ఆరు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు అందజేశారు. క్లబ్ సభ్యుడు దేవకి మణిధర్ తన వంతు సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వీవీ కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ ఈ. వినయ్ కుమార్, ట్రెజరర్ కోట చంద్రశేఖర్ గుప్తా, పూర్వపు అధ్యక్షులు లక్కీ టైల్స్ నగేష్, ఎంఎస్ ఫణికుమార్, ఏవి శివప్రసాద్, ఎస్. పులిరాజ్ ఆనంద్, రాచపల్లి రాజేష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు చిత్తలూరి శ్రీరాములు, క్లబ్ సభ్యులు వై. సంతోష్ కుమార్, జి. చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle