Kanipakam: కాణిపాకంలో ఘనంగా వరుణ యాగం, వెల్లడించిన ఎమ్మెల్యే మురళీమోహన్!
Kanipakam: చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వర్షాలు కురవాలని కోరుతూ వరుణ జపం మరియు వరుణ యాగం నిర్వహించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్.
Kanipakam: కాణిపాకంలో ఘనంగా వరుణ యాగం, వెల్లడించిన ఎమ్మెల్యే మురళీమోహన్!
Kanipakam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పుణ్యక్షేత్రాలు దేవాలయాల నందు వరుణ జపం వరుణ్ యాగం నిర్వహించడం జరిగిందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏలినో ప్రభావంతో రైతులు, ప్రజలు వర్షాలు పడక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని దేవాలయాల నందు ఆగమశాస్త్రం, రిత్విక శాస్త్రం ప్రకారం పండితులు వరుణ జపం, వరుణ యాగం కాణిపాక ఆలయంలో నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆలయ ఈవో మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు కాణిపాక దేవాలయంలో వరుణ్ యాగం, వరుణ జపం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ వేద పండితులు రుత్వికులు ఆలయ అధికారులు భక్తులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.




