Chittoor: చిత్తూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా వరుణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ!
Chittoor: చిత్తూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వరుణ్ కుమార్. కూటమి పార్టీల సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యమంటూ ప్రకటన.
Chittoor: చిత్తూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా వరుణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ!
Chittoor: చిత్తూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానన్నారు. పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ , సీనియర్ నాయకులు, కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలతో పాటు కూటమి పార్టీల నాయకులు,శ్రేణులను సమన్వయం చేసుకుంటూ నగరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తామని తెలిపారు.ప్రతి డివిజన్, బూత్ స్థాయిలో నాయకులు,కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.




