Chittoor: అర్ధగిరి ఆలయానికి రామ్ రక్ష: ఉపాసన కొణిదెల
Chittoor: చిత్తూరు జిల్లా అరగొండలోని ప్రసిద్ధ అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయానికి రామ్ రక్షను తీసుకువస్తున్నట్లు ఉపాసన కామినేని కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
Chittoor: అర్ధగిరి ఆలయానికి రామ్ రక్ష: ఉపాసన కొణిదెల
చిత్తూరు: అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు, మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల చిత్తూరు జిల్లాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని చాటుకున్నారు. అరగొండలోని ప్రసిద్ధ అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయానికి రామ్ రక్షను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
అరగొండలో తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.తన తాత జన్మస్థలమైన చిత్తూరు ప్రాంతం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని ఉపాసన పేర్కొన్నారు. ఆయన సేవా స్ఫూర్తితో మహిళల ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగి ఆర్థికంగా స్వతంత్రులుగా నిలవాలని ఆకాంక్షించారు.
హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చిన పురాణ గాథతో అనుబంధం ఉన్న అర్ధగిరి క్షేత్రం భక్తి, విశ్వాసం, స్వస్థతకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. చిత్తూరుతో ఉన్న కుటుంబ అనుబంధాన్ని సేవా కార్యక్రమాల ద్వారా కొనసాగించాలన్నది తన ఆకాంక్షగా ఉపాసన వెల్లడించారు.




