Chittoor: ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం: దళిత వేదిక రాజా

Chittoor: చిత్తూరు జానకాలపల్లిలో ఏపీ దళిత వేదిక అధ్యక్షుడు రాజా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసి, సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 6 Nov 2026 3:58 PM IST
Chittoor
X

Chittoor: ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం: దళిత వేదిక రాజా

చిత్తూరు: ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక సంఘం అధ్యక్షులు రాజా తెలిపారు. చిత్తూరు నగరంలోని జానకాలపల్లిలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఆయన కుమారుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డులోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ప్రతి ఏడాది తన కుమారుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు. చిన్నతనం నుంచి తన కుమారునికి సేవాగుణం సేవా తత్వం వచ్చేలా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామన్నారు.

వార్డులోని ప్రజలే కాకుండా నగరంలోని ప్రజలు వారి సమస్యలను తన దృష్టికి తీసుకొని వస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డన్న రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు అన్నమయ్య జిల్లా కన్వీనర్ వీరన్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor