Chittoor: పెద్దిశెట్టిపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్!

Chittoor: చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఏకగ్రీవ సర్పంచ్ పురుషోత్తం తెలిపారు. ఎమ్మెల్యే, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

Chandra Sekhar, Chittoor
Published on: 29 Nov 2026 4:56 PM IST
Chittoor
X

Chittoor: పెద్దిశెట్టిపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్! 

Chittoor: చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సర్పంచ్ పురుషోత్తం తెలిపారు. కూటమి ప్రభుత్వం, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో గ్రామ ప్రజలు తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో బాధ్యతను పెంచిందన్నారు.

పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, వీధిదీపాల ఏర్పాటు వంటి పనులను చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు అవసరమైన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.

గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ పెద్దిశెట్టిపల్లి పంచాయతీని ఆదర్శంగా నిలుపుతానని పురుషోత్తం స్పష్టం చేశారు. తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు, తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor