Chandragiri: చంద్రగిరి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ!
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు.
Chandragiri: చంద్రగిరి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ!
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తిరుపతిలోని డీఆర్‌డీఏ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తుండగా, ఎంపీటీసీ నామినేషన్లను ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు.
చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రం వద్ద తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు, వారి ప్రతిపాదకులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులు సైతం బారికేడ్ల అవతలే ఉండి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూచించారు..




