Madanapalle: మదనపల్లె 34వ వార్డులో టీడీపీ ఘన విజయం
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 34వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోయపాటి రంగస్వామి నాయుడు 727 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Madanapalle: మదనపల్లె 34వ వార్డులో టీడీపీ ఘన విజయం
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి బోయపాటి రంగస్వామి నాయుడు ఘన విజయం సాధించారు. 727 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించి విజయకేతనం ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. వార్డు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.




