Punganur: పుంగనూరులో 36కి 36 వార్డులు గెలిచి సీఎం చంద్రబాబుకు గిఫ్ట్ ఇద్దాం!
Punganur: పుంగనూరులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. 36కి 36 మున్సిపల్ వార్డులు గెలిచి సీఎం చంద్రబాబు, లోకేష్‌లకు బహుమానంగా ఇవ్వాలని రవినాయుడు, మధుసూదన్ నాయుడు పిలుపు.
Punganur: పుంగనూరులో 36కి 36 వార్డులు గెలిచి సీఎం చంద్రబాబుకు గిఫ్ట్ ఇద్దాం!
పుంగనూరు: పుంగనూరు టీడీపీ కార్యాలయంలో ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు , పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఎవరికి సీటు కేటాయించినా, అందరూ కలిసికట్టుగా, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పుంగనూరు మున్సిపాలిటీలోని 36 వార్డులకు 36 వార్డులు గెలిచి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత శ్రీ నారా లోకేష్ గారికి బహుమానంగా ఇవ్వాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి సంబంధించిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




