Madanapalle: మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ కసరత్తు.. అభ్యర్థుల ఎంపికపై సమగ్ర సమీక్ష!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే షాజహాన్ భాష కసరత్తు. 48 వార్డుల ఆశావాహులతో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

Srinivasulu, Madanapalle
Published on: 11 Oct 2026 12:07 PM IST
Madanapalle
X

Madanapalle: మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ కసరత్తు.. అభ్యర్థుల ఎంపికపై సమగ్ర సమీక్ష!

Madanapalle: మదనపల్లె పట్టణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మదనపల్లె శాసనసభ్యులు ఎం. షాజహాన్ భాష హాజరయ్యారు.

మదనపల్లె మున్సిపాలిటీలోని 48 వార్డుల నుంచి కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేయాలనుకుంటున్న నాయకులు సమావేశానికి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నాయకుల అభిప్రాయాలు, ఆసక్తిని తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాష మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వార్డుల వారీగా పార్టీ పరిస్థితులు, ప్రజల సమస్యలు, స్థానికంగా నాయకుల పనితీరుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle