Rayachoti: వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణకు సుగవాసి ప్రసాద్ బాబుకు ఆహ్వానం

Rayachoti: స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వాన పత్రికను రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబుకు అందజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Updated on: 4 Oct 2026 8:08 PM IST
Rayachoti
X

Rayachoti: వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణకు సుగవాసి ప్రసాద్ బాబుకు ఆహ్వానం

Rayachoti: రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి

స్వాతంత్ర్య సమరయోధుడు, వీరుడు శ్రీ వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన సుగవాసి ప్రసాద్ బాబు గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI