Madanapalle: వినాయకుని ఆశీస్సులతో కోళ్లబైలు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ప్రచార భేరి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు 1, 2 ఎంపీటీసీ స్థానాల టీడీపీ అభ్యర్థులు మోహన్ రెడ్డి, కమల అనురాధ ప్రచార ప్రారంభం.
Madanapalle: వినాయకుని ఆశీస్సులతో కోళ్లబైలు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ప్రచార భేరి!
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు 1, 2 ఎంపీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మోహన్ రెడ్డి, కమల అనురాధ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. టిడిపి కోళ్లబైలు 1, 2 ఇన్‌చార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో రామిరెడ్డి లేఅవుట్‌లోని వినాయకుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వినాయకుని ఆశీస్సులతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ... వినాయకుని ఆశీస్సులతో ప్రారంభించిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, అభ్యర్థులు మోహన్ రెడ్డి, కమల అనురాధ ప్రజలను కలుసుకుని తమ అభ్యర్థిత్వాన్ని వివరిస్తారని తెలిపారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జై భీమ్ నాయకులు కోనా భాస్కర్ ,బాలమలి శేఖర్, మాజీ ఉపసర్పంచ్, టిడిపి సీనియర్ నాయకులు వేణు, పాండు, అనంత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




