Kuppam: పూల మార్కెట్ వద్ద రైతుల ఆందోళన.. 3 నెలల్లో మార్కెట్ నిర్మాణ హామీ!

Kuppam: కుప్పం పూల మార్కెట్ ఎదుట కనీస వసతులు లేక రైతులు ఆందోళన చేపట్టగా, 3 నెలల్లో ప్రభుత్వ పూల మార్కెట్ నిర్మిస్తామని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజకుమార్ హామీ ఇచ్చారు.

KUMAR, KUPPAM
Published on: 27 Oct 2026 9:45 AM IST
Kuppam
X

Kuppam: పూల మార్కెట్ వద్ద రైతుల ఆందోళన.. 3 నెలల్లో మార్కెట్ నిర్మాణ హామీ!

Kuppam: కుప్పం పూల మార్కెట్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన రైతులు. ప్రైవేటు పూల మార్కెట్‌లో కనీస వసతులు లేవంటూ రైతుల ఆవేదన.

మార్కెట్‌ లో స్థలం లేక పూలను విక్రయించలేకపోతున్నామని రైతుల ఆవేదన. మార్కెట్ బయట పూలు అమ్ముకుంటుంటే షాపు యజమానులు అడ్డుకుంటున్నారని రైతుల ఆరోపణ. ఎలాంటి వేలం ప్రక్రియ లేకుండా తక్కువ ధరలకు పూలు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన.

కమిషన్ల కోసం ఆశపడి పూలకు తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతుల ఆరోపణ. ప్రభుత్వం స్పందించి కుప్పంలో ప్రభుత్వ పూల మార్కెట్ నిర్మించాలని రైతుల డిమాండ్. రైతుల ఆందోళనతో పూల మార్కెట్ వద్దకు చేరుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ జీఎం రాజు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజకుమార్.

కుప్పం పట్టణ పరిసరాల్లో రెండు ఎకరాల్లో ప్రభుత్వ పూల మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ. మూడు నెలల్లో ప్రభుత్వ పూల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని రైతులకు హామీ. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ జీఎం రాజు, టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజకుమార్.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM