Kuppam: ఎమ్మెల్సీ భరత్‌కు ప్రతిసవాల్ విసిరిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్!

Kuppam: కుప్పం ఎన్నికల ఘటనలపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌కు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రతిసవాల్ విసిరారు.

KUMAR, KUPPAM
Published on: 28 Nov 2026 11:28 AM IST
Kuppam
X

Kuppam: ఎమ్మెల్సీ భరత్‌కు ప్రతిసవాల్ విసిరిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్!

Kuppam: ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగింది.గత 40 ఏళ్లుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికలు నిర్వహించారు.గత 5 ఏళ్లలో రాష్ట్రంలో మరియు కుప్పం నియోజకవర్గంలో అరాచక పాలన జరిగింది..ఎన్నికలు సజావుగా జరిపేందుకు తీసుకున్న చర్యల పై టీడీపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ నాయకులు వారి పాలన నుండి ఇంకా బయటకు రాలేదుఅనేక చోట్ల టీడీపీ మద్దతుదారులను రెచ్చగొట్టడం, వారి పై దాడులు చేస్తున్నారు.వానగుట్టపల్లిలో వైసీపీ రెబల్ అభ్యర్థి 42 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు.కౌంటింగ్ ఏజెంట్లు రీ అడిగారని కౌంటింగ్ కేంద్రం పై రాళ్లతో దాడి చేశారు.ఎన్నికల అధికారి కారు పై రాళ్లతో దాడి చేశారు. కంగారులో కారు డ్రైవర్ కారును నడపడంతో టీడీపీ కార్యకర్త రాజేంద్ర మృతి చెందాడు.

రాజేంద్ర అన్న కొడుకును చూపించి రాజేంద్ర వైసీపీకి చెందిన వ్యక్తి అని చెప్తున్నారు. కర్లగట్టలో టీడీపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి గెలవడంతో టీడీపీ నేత చంద్ర ఇంటి పై వైసీపీ నేతలు దాడి చేశారు.చంపడానికైనా , చావడానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో అభ్యర్థులను పెడుతున్నామని ఎమ్మెల్సీ భరత్ ఎన్నికల ముందు చెప్పారు.సొంత బాబాయి నీ చంపిన పార్టీని గొడ్డలి పార్టీ..

చంద్ర ఇంట్లోకి ప్రవేశించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించి ఇంట్లోని ఆడవాళ్లను భయబ్రాంతులకు గురి చేశారు.కుప్పంలో పోలీస్ స్టేషన్, కోర్టు లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారుగత 5 ఏళ్లలో కుప్పానికి చంద్రబాబును అడ్డుకున్నారు..2021 లో మున్సిపల్ ఎన్నికల్లో నీతి నిజాయితీగా గెలిచామని ప్రమాణం చేయగలరా భరత్??

ఎమ్మెల్సీ భరత్ కు ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్2019 - 2024 మధ్య దొంగ కేసులు మేము పెట్టలేదని ప్రమాణం చేయగలవా భరత్కుప్పంలో అరాచకాలకు పాల్పడిన మీరు ఇప్పుడు ప్రమాణం చేయమంటున్నారా?మా అధినేత ఎదురు దాడి చేయండి అని ఒక మాట చెపితే కుప్పంలో వైసీపీ వారు ఉండగలరా?దాడులు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని చెప్పాలి కానీ మీరు దాడులు చేసిన వారిని వెనకేసుకొని వస్తున్నారా?మెజారిటీ వస్తె టీడీపీ నాయకుడి ఇంటి పై దాడులు చేస్తారా?నువ్వు ప్రమాణం చేసిన తరువాత నేను ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను..

మీ లాగా దొంగ పనులు చేసి గెలవాల్సిన పరిస్థితి మాకు లేదు.ఎవరైనా ఇక దాడులు చేస్తే మేము చూస్తూ ఊరుకోము.హింసా సంస్కృతిని ప్రేరేపిస్తే అది మీకు తిరిగి వస్తుంది.ప్రజల తీర్పును స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము..

రాజేంద్ర కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్గ్రెసియా ప్రకటించారు.రాజేంద్ర కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.రాజేంద్ర కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM