Chittoor: పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం: చైర్మన్ సుధీర్
Chittoor: చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్ పేట జడ్పీ హైస్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా సుధీర్, వైస్ చైర్మన్గా అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Chittoor: పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం: చైర్మన్ సుధీర్
చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలం బిఎన్ఆర్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్గా సుధీర్,వైస్ చైర్మన్ గా అరుణ నియమతలయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా 13 మందిని ఏకగ్రీవంగా విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్గా ఎన్నుకున్న సుదీర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అలాగే సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం డివైఓ ఇందిరా మాట్లాడుతూ ఈ నూతన కమిటీ రెండు సంవత్సరాల కాలవ్యవధికి పనిచేస్తారని తెలిపారు.
గత వారంలో అన్ని పాఠశాలల్లో విద్యా కమిటీలు ఏర్పాటు కాగా ఈ పాఠశాల నందు గతవారం కోరం లేని కారణంగా ఈరోజు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ హెడ్మాస్టర్ రమేష్,ఎస్ ఎస్ ఎ పరిశీలకులు నందకుమార్, ఎంఈఓ 1 సెల్వరాజ్, ఎం ఈ ఓ 2 మోహన్, లు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా స్థానిక ఎస్సై మణికంటేశ్వర్ రెడ్డి పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.




