Srikalahasti: వార్డు కార్యదర్శులపై లాఠీచార్జీకి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన!
Srikalahasti: చలో విజయవాడలో స్వర్ణ వార్డు ఉద్యోగులపై లాఠీచార్జీకి నిరసన: శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో వార్డు కార్యదర్శుల ఆందోళన.
Srikalahasti: వార్డు కార్యదర్శులపై లాఠీచార్జీకి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన!
శ్రీకాళహస్తి: చలో విజయవాడ కార్యక్రమంలో స్వర్ణ వార్డు కార్యదర్శులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వర్ణ వార్డు కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొని లాఠీచార్జీ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమంలో సిబ్బందిపై లాఠీచార్జీ చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వర్ణ వార్డు కార్యదర్శులు అందరూ పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.




