Srikalahasti: జాతీయ కరాటే పోటీల్లో శ్రీకాళహస్తి విద్యార్థుల అద్భుత ప్రతిభ!

Srikalahasti: నెల్లూరులో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీకాళహస్తి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 6 బంగారు, 9 వెండి, 11 కాంస్య పతకాలు సాధించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 5 Oct 2026 7:14 PM IST
Srikalahasti
X

Srikalahasti: జాతీయ కరాటే పోటీల్లో శ్రీకాళహస్తి విద్యార్థుల అద్భుత ప్రతిభ!

Srikalahasti: నెల్లూరులో నిర్వహించిన 5వ KENY Shito Ryu National Level Karate Championships–2026లో శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు.

ఈ జాతీయస్థాయి కరాటే పోటీల్లో U-11, U-14, U-17, జూనియర్, సీనియర్ విభాగాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. కటా, కుమిటే (ఫైట్) విభాగాల్లో పోటీపడి తమ ప్రతిభను చాటారు.

శ్రీకాళహస్తి నుంచి మొత్తం 23 మంది విద్యార్థులు పాల్గొనగా, వారు ఏకంగా 26 పతకాలు సాధించడం విశేషం.

బంగారు పతకాలు – 06

వెండి పతకాలు – 09

కాంస్య పతకాలు – 11

జాతీయస్థాయి పోటీల్లో శ్రీకాళహస్తి విద్యార్థులు సత్తా చాటడం పట్ల తల్లిదండ్రులు, కోచ్‌లు, కరాటే నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థుల కృషి, పట్టుదలతో పాటు కోచ్‌ల శిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు.

విజేతలు భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి శ్రీకాళహస్తికి మరింత పేరు, ప్రతిష్ఠ తీసుకురావాలని ఆకాంక్షించారు.

జాతీయస్థాయిలో సత్తా చాటిన శ్రీకాళహస్తి కరాటే ఛాంపియన్స్‌కు హృదయపూర్వక అభినందనలు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI