Srikalahasti: తొట్టంబేడులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచార హోరు
Srikalahasti: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలన్నారు.
Srikalahasti: తొట్టంబేడులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచార హోరు
Srikalahasti: శ్రీకాళహస్తి లోని తొట్టంబేడు మండలం లో జరిగే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోజు సింగమాల గ్రామం నుండి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొట్టంబేడు మండలంలోని 12 ఎంపీటీసీలకు ఆరు ఎంపీటీసీలు ఏకీగ్రీవం అవ్వగా మరో ఆరు ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఈ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
కోటమీ ప్రభుత్వం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గ్రామంలో మరింత అభివృద్ధి జరగాలి అంటే తమ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. నామినేషన్ వేసుందుకు వైసీపీ నాయకులు గుంపులు గుంపులుగా వచ్చి రెచ్చగొట్టే ధోరణి అవలంబించారని అన్నారు. బియ్యపు పవిత్ర రెడ్డి,ఆకాష్ రెడ్డి మీద నాన్ బెల్ కేసులు పెట్టారని ఆరోపించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి,నాన్ వెలబుల్ కేసులు పెట్టారని ప్రెస్ ముఖంగా నిరూపించాలని అన్నారు. అనంతరం జడ్పిటిసి అభ్యర్థి ముని రాజా నాయుడు మాట్లాడుతూ ఎన్నికలలో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని గ్రామస్తులను కోరారు.




