Madanapalle: చంద్రప్రభ అలంకరణలో మదనపల్లె వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Madanapalle: మదనపల్లెలో దసరా నవరాత్రి ఉత్సవాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చంద్రప్రభ అలంకరణలో దర్శనం
Madanapalle: చంద్రప్రభ అలంకరణలో మదనపల్లె వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని చంద్రప్రభ అలంకరణలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక అలంకరణలో దర్శించుకునే అవకాశం కల్పించడం విశేషమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ.. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాండు, ట్రెజరర్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ యల్లంపల్లి ప్రశాంత్, లక్కీ టైల్స్ నగేష్, ఆనంద్, సంఘ సభ్యులు పాణి, శివ, చైతన్య, వినోద్, నందన్, శ్రీరాములు, సంతోష్, నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.




