Srikalahasti: శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ

Srikalahasti: శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో నిధుల వినియోగంపైవిజయవాడ నుంచి వచ్చిన స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ ఆర్థిక లావాదేవీలు రికార్డులను పరిశీలిస్తున్న సభ్యులు

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 29 Sept 2026 1:38 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ

Srikalahasti: శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలపై విజయవాడ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన స్పెషల్ ఆడిట్ కమిటీ సభ్యులు మంగళవారం విచారణ చేపట్టారు. ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, రికార్డులను కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు.

ఆసుపత్రి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసన్న, ఒప్పంద ఉద్యోగి చందు కాలపరిమితి తదితర అంశాలపై కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా 2023 సంవత్సరం నుంచి 2026 ఆగస్టు వరకు లక్ష్మీ ప్రసన్న నిర్వహించిన విధులు, ఆమె పరిధిలో ఉన్న రికార్డులు, నిధుల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అలాగే ఈ కాలంలో ఆసుపత్రిలో పనిచేసి పదవీ విరమణ చేసిన, బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన సూపరింటెండెంట్లను సైతం కమిటీ సభ్యులు విచారించి వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆసుపత్రి నిధుల వినియోగంలో ఏమైనా అవకతవకలు జరిగాయా? రికార్డులు నిబంధనల ప్రకారం నిర్వహించారా? అనే అంశాలపై స్పెషల్ ఆడిట్ కమిటీ సమగ్రంగా విచారణ కొనసాగిస్తోంది. విచారణ పూర్తయిన అనంతరం కమిటీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI