Madanapalle: కాంగ్రెస్ ఇన్‌చార్జి పీవీ మోహన్‌ను కలిసిన షేక్ రెడ్డి సాహెబ్!

Madanapalle: విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జి పీవీ మోహన్‌ను కలిసిన మదనపల్లె సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్.

Srinivasulu, Madanapalle
Published on: 20 Sept 2026 5:04 PM IST
Madanapalle
X

Madanapalle: కాంగ్రెస్ ఇన్‌చార్జి పీవీ మోహన్‌ను కలిసిన షేక్ రెడ్డి సాహెబ్!

Madanapalle: విజయవాడ, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జిగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీ మోహన్‌ను మదనపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ ఆదివారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో పీవీ మోహన్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై రాజంపేట పార్లమెంట్ పరిధిలో, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం తదితర అంశాలపై చర్చించారు. అలాగే అన్నమయ్య జిల్లాలో త్వరలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని పీవీ మోహన్‌ను షేక్ రెడ్డి సాహెబ్ కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle