Chittoor: చిత్తూరులో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం!
Chittoor: చిత్తూరు నగరంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పాల్గొన్నారు.
Chittoor: చిత్తూరులో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం!
Chittoor: చిత్తూరు నగరంలోని ఇరువారం సమీపంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కళ్యాణ మండపంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చిత్తూర్ గోల్డ్, రెడ్ క్రాస్ సొసైటీ, ఆర్కే విద్యాసంస్థలు, NSS యూనిట్, MV కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
విద్యార్థులు యువకులు వివిధ సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన శరీరంలో కొత్త రక్తం రావడంతో మరింత ఆరోగ్యంగా ఉంటారని రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో Sfi అధ్యక్ష కార్యదర్శులు దుర్గాప్రసాద్, మహమ్మద్ మసూద్ ఈగల్ టీం ప్రతినిధులు కుమార్, సుందర్, రాజశేఖర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు డాక్టర్ విజయ్ కుమార్, చిరంజీవి, లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూర్ గోల్డ్.




