Srikalahasti: శ్రీకాళహస్తి 9వ బెటాలియన్‌లో 'సమాచార దీపిక' పుస్తకాల పంపిణీ!

Srikalahasti: శ్రీకాళహస్తి 9వ పోలీసు బెటాలియన్‌లో 'సమాచార దీపిక' పుస్తకాల పంపిణీ. శిక్షణ సిబ్బందికి విధులు, నిబంధనలపై అవగాహన కల్పించేలా వీటిని రూపొందించినట్లు వెల్లడి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 23 Sept 2026 1:21 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి 9వ బెటాలియన్‌లో 'సమాచార దీపిక' పుస్తకాల పంపిణీ!

Srikalahasti: డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు శిక్షణలో ఉన్న పోలీసు సిబ్బందికి ఉపయోగపడేలా రూపొందించిన ‘సమాచార దీపిక’ ను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొమ్మిదో పోలీసు బెటాలియన్‌లో పంపిణీ చేశారు.

రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సమాచార దీపికలో పోలీసు సిబ్బందికి సంబంధించిన సేవా అంశాలు, ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు, విధి నిర్వహణకు అవసరమైన ఇతర సమాచారాన్ని పొందుపరిచారు.

ఈ సందర్భంగా తొమ్మిదో బెటాలియన్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు గురజాల శ్రీనివాసులు శిక్షణలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచార దీపికలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తమ విధులు, సేవా నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులపై పూర్తి అవగాహన కలిగి ఉండేందుకు ‘సమాచార దీపిక’ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. శిక్షణ కాలంలోనే కాకుండా భవిష్యత్తులో విధి నిర్వహణ సమయంలోనూ ఈ సమాచార దీపికను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శిక్షకులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI