Chittoor: పాపసముద్రంలో సి. అరుణ మోహన్ రెడ్డి ముమ్మర ఎన్నికల ప్రచారం!

Chittoor:గుడిపాల మండలం పాపసముద్రం సర్పంచ్ అభ్యర్థి సి. అరుణ మోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 29 Nov 2026 12:23 PM IST
Chittoor
X

Chittoor: పాపసముద్రంలో సి. అరుణ మోహన్ రెడ్డి ముమ్మర ఎన్నికల ప్రచారం!

Chittoor: గుడిపాల మండలం పాపసముద్రం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సి. అరుణ మోహన్ రెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని ధర్మరాజుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు రహదారుల అభివృద్ధి, మెరుగైన విద్యా, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తానని తెలిపారు.అలాగే గ్రామంలో ఆడపిల్ల జన్మించిన కుటుంబాలకు మేనత్త కానుకగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సేవ కోసం తనకు ఒక్క అవకాశం కల్పించి మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor