Nagari: నగరి మున్సిపల్ వివాదంపై కలెక్టర్, ఎస్‌ఈసీకి రోజా ఫిర్యాదు
Nagari: నగరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అక్రమాలు, కోసలనగరం ఎంపీటీసీ నామినేషన్ తిరస్కరణపై చిత్తూరు కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేశారు.
Nagari: నగరి మున్సిపల్ వివాదంపై కలెక్టర్, ఎస్‌ఈసీకి రోజా ఫిర్యాదు
చిత్తూరు జిల్లా: కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్‌కు పాత తేదీతో డిక్లరేషన్ జారీ చేసిన నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా విజయపురం మండలం కోసలనగరం ఎంపీటీసీ అభ్యర్థి భవాని నామినేషన్ తిరస్కరణపై కూడా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఎంతవరకైనా పోరాడతానని ఆర్కే రోజా స్పష్టం చేశారు.




