Madanapalle: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: పునీత్ కుమార్
Madanapalle: వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లెలో బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు.
Madanapalle: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: పునీత్ కుమార్
మదనపల్లె: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని సందర్శించి, వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, శాశ్వత ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
ఈపీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ లీవ్, ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు వంటి ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వారితో చర్చలు జరిపి పరిష్కరించాలని పునీత్ కుమార్ కోరారు. ఉద్యోగులపై వేధింపులకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




