Rayachoti: రాయచోటి 21వ వార్డులో వైసీపీ నేతలకు గుర్తింపు కార్డుల పంపిణీ

Rayachoti: జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రాయచోటి అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని, కూటమి ప్రభుత్వం జిల్లా కేంద్రాన్ని రద్దు చేసి అన్యాయం చేసిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 3 Oct 2026 6:41 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి 21వ వార్డులో వైసీపీ నేతలకు గుర్తింపు కార్డుల పంపిణీ

రాయచోటి: జగన్ ప్రభుత్వ హయాంలో రాయచోటి పట్టణ అభివృద్ధి పరుగులు పెట్టిందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపాలిటీ లోని 21 వ వార్డులో వైఎస్ఆర్ సిపి లో వివిధ హోదాలలో పదవులు పొందినవారికి గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం, 95 రకాల జిల్లా ప్రధాన కార్యాలయాల ఏర్పాటు చేశామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జిల్లా కేంద్రాన్ని ఎత్తేసి, ఈ ప్రాంత ప్రజల గొంతుకోసారన్నారు.

మున్సిపాలిటీని గ్రేడ్3 నుండి స్పెషల్ గ్రేడ్ గా అప్ గ్రేడ్ చేయడం, క్రికెట్ స్టేడియం, నగర వనం, స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణాలు, రూ16 కోట్ల నిధులతో ఠాణా నుండి చెన్నముక్కపల్లె రింగ్ రోడ్ పరకు నాలుగు వరసల రహదారి, రాయచోటి పట్టణంలోని మదనపల్లి రహదారి విస్తరణ, పట్టణం లోని రింగ్ రోడ్డును నాలుగు వరుసల రహదారిని చేసేపనులకు అనుసుతులు మంజూరు, పట్టణంలో రూ 4.15 కోట్లతో గుణ్ణికుంట్ల రహదారి విస్తరణ అభివృద్ధి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర రూ 3.85 కోట్ల నిధులతో టిటి.డి. కళ్యాణమండపం నిర్మాణం, పట్టణంలో మైనారిటీ సోదరులకు నూతన హంగులతో షాదీఖాన నిర్మాణం కొరకు స్థల కేటాయింపు.

రూ40 లక్షల రూపాయలు నిధులతో రాయచోటి పట్టణంలోని షాదీఖానాకు మరమ్మత్తు పనులు, నాలుగు వరుసల రహదారిలో దేశ జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు, పట్టణంలో ప్రధాన కూడలన్నింటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనుల పూర్తి,4 అర్బన్ హెల్త్ కేంద్రాలు ఏర్పాటు,వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధి,రూ 2.50 కోట్లతో ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ,రూ 23 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, రూ.1.33 కోట్లతో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవన నిర్మాణాలు, రూ 1 కోటి నిధులతో రైతు బజార్,రూ 1.08 కోట్ల తో రాయచోటి ఎంపిడిఓ కార్యాలయ భవనం, రూ 98 లక్షలతో డి ఎస్ పి కార్యాలయ భవనం, రూ 2.40 కోట్లతో మున్సిపల్ సభా భవనం,రూ 73 లక్షల నిధుల తో మున్సిపల్ డైట్ పార్క్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటు, బాలికల కోసం మూడవ తరగతి నుండి డిగ్రీ వరకు ఒకే ప్రాంగణంలో ఉండేలా గర్ల్స్ హైస్కూల్ అభివృద్ధి, పట్టణ పేదలకు నారాయణరెడ్డిగారిపల్లె వద్ద 6 వేల ఇళ్లతో జగనన్న కాలనీ, మధ్యతరగతి ప్రజలకు ఎం ఐ జి లే ఔట్ మరియు రహదారుల అభివృద్ధి పనులును చేపట్టామని ఆయన వివరించారు.

పట్టణంలోని కొత్తపేట, ఎన్ జిఓ కాలనీ లతో పాటు పలు వార్డులను ఎంతో అభివృద్ధి చేసామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలన్నారు. పార్టీ బాధ్యతలకు గుర్తింపు కార్డులు ప్రతీక అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు మహేష్ రెడ్డి,మద్దిరేవుల శంకర్ రెడ్డి, అమర నాధ రెడ్డి,ఆదినారాయణ రెడ్డి,సన్నీ కార్తిక్,నవీన్, పవన్, హర్ష వర్ధన్ రెడ్డి,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI