Rayachoti: కూటమి విజయానికి సమిష్టిగా పనిచేయాలి: దారం అనిత

Rayachoti: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ అభ్యర్థుల గెలుపునకు సమిష్టిగా పనిచేయాలని రాయచోటి సమావేశంలో దారం అనిత పిలుపునిచ్చారు.

Srinivasulu, Madanapalle
Published on: 26 Sept 2026 9:58 PM IST
Rayachoti
X

Rayachoti: కూటమి విజయానికి సమిష్టిగా పనిచేయాలి: దారం అనిత

రాయచోటి: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ NDA కూటమి అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేయాలని రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయకర్త దారం అనిత పిలుపునిచ్చారు.

శనివారం రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన కూటమి నాయకుల సమన్వయ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక పరిస్థితులు, మూడు పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల కార్యాచరణపై నాయకులు చర్చించారు. సీటు ఎవరికొచ్చిందనేది కాదు.. కూటమి అభ్యర్థి గెలుపే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని దారం అనిత సూచించారు.

ఒక పార్టీకి సీటు కేటాయించిన వార్డులో మిగిలిన రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు. బూత్ స్థాయి నుంచి వార్డు, మున్సిపల్ స్థాయి వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోనల్ కమిటీ చైర్మన్ దామాచర్ల సత్య, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు, మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, నాగోతు రమేష్, అతికారి కృష్ణ, తాతంశెట్టి నాగేంద్ర, తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జి శంకర్ యాదవ్, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి మధుసూదన్ నాయుడు, నరేంద్ర, చల్లపల్లి నరసింహారెడ్డి తదితర టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle