Rayachoti: రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో శిశువు చేతి ఎముక విరుగుటపై విచారణకు డిమాండ్

Rayachoti: రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ప్రసవం వేళ శిశువు చేతి ఎముక విరిగిన ఘటనపై నిపుణుల బృందంతో సమగ్ర విచారణ జరిపించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యుగంధర్ డిమాండ్ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 3 Oct 2026 3:25 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో శిశువు చేతి ఎముక విరుగుటపై విచారణకు డిమాండ్

రాయచోటి: రాయచోటి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం నవజాత శిశువుకు చేతి ఎముక విరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై సమగ్ర వైద్య విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీ యుగంధర్ అబ్బవరం డిమాండ్ చేశారు.

కాకులారం హరిజనవాడకు చెందిన బి. హేమలత 30-09-2026న ప్రసవం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, 01-10-2026న సాధారణ ప్రసవం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రసవం అనంతరం పుట్టిన శిశువు చేతికి గాయం/ఎముక విరిగినట్లు గుర్తించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ప్రసవ సమయంలోనే గాయం జరిగిందా, ప్రసవానంతరం జరిగిందా లేదా ఇతర వైద్యపరమైన కారణాలు ఉన్నాయా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని యుగంధర్ అబ్బవరం అన్నారు. అందుకోసం సీనియర్ ప్రసూతి వైద్యులు, శిశు వైద్యులు, ఆర్థోపెడిక్ నిపుణులతో కూడిన వైద్య బృందంతో సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు.

అలాగే తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ప్రసవం పూర్తయ్యే వరకు ఉన్న వైద్య రికార్డులు, డెలివరీ నోట్స్, శిశువు జననానంతర పరీక్షల వివరాలు, ఎక్స్‌రేలు మరియు ఇతర వైద్య ఆధారాలను భద్రపరచాలని కోరారు. సంబంధిత సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ రికార్డులు కూడా తొలగిపోకుండా సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

బాధిత శిశువుకు అవసరమైన ఆర్థోపెడిక్ చికిత్స, తదుపరి పరీక్షలు, మందులు మరియు అవసరమైన వైద్య సదుపాయాలను ప్రభుత్వ ఖర్చుతో అందించాలని డిమాండ్ చేశారు. విచారణ అనంతరం గాయం ఏర్పడిన కారణాలపై స్పష్టమైన వైద్య నివేదికను బాధిత తల్లిదండ్రులకు అందించాలని కోరారు.

విచారణలో వైద్యపరమైన నిర్లక్ష్యం లేదా విధి నిర్వహణలో లోపాలు నిర్ధారణ అయితే, నిబంధనల ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని యుగంధర్ అబ్బవరం కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI