Ramapuram: చిట్లూరు సర్పంచ్‌గా గాలివీటి సావిత్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక
Ramapuram: రామాపురం మండలం చిట్లూరు సర్పంచ్‌గా గాలివీటి సావిత్రమ్మ, ఉప సర్పంచ్‌గా మల్లమ్మ, 12 వార్డు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక; మంత్రి రాంప్రసాద్‌కు కృతజ్ఞతలు.
Ramapuram: చిట్లూరు సర్పంచ్‌గా గాలివీటి సావిత్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక
రామాపురం: రామాపురం మండలం చిట్లూరు గ్రామ సర్పంచ్‌గా గాలివీటి సావిత్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా ఏకగ్రీవ విజయం సాధించిన ఆయన శనివారం ఎన్నికల అధికారుల నుంచి డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. అదేవిధంగా గ్రామంలోని 12 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉప సర్పంచ్‌గా చింత పిచ్చల మల్లమ్మ ని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా , వార్డు సభ్యులను స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గ్రామంలో అభినందనలు వెల్లువెత్తాయి.
నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ గాలివీటి సావిత్రమ్మ
ఈ సందర్భంగా నూతన సర్పంచ్ గాలివీటి సావిత్రమ్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి చిట్లూరు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి, గారికి చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి , టీడీపీ యువ నాయకులు మోర్య రెడ్డి, గారికి టిడిపి సీనియర్ నాయకులు , రామాపురం మండల అధ్యక్షుడు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు అలాగే చిట్లూరు గ్రామం MPTC మార్పురి చెన్న కృష్ణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తన ఎన్నికకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, అభిమానులు, గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
నూతన సర్పంచ్ గాలివీటి సావిత్రమ్మ , ఉప సర్పంచ్ చింత పిచ్చల మల్లమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైన 12 మంది వార్డు సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు 12 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో చిట్లూరు గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నూతన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.




