Rajampet: ఆదర్శమూర్తి చమర్తి సుబ్బరాజు కన్నుమూత.. కన్నీటి వీడ్కోలు
Rajampet: రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో విద్యాదీపాలు వెలిగించిన చమర్తి సుబ్బరాజు కన్నుమూత. తండ్రి పార్థివదేహాన్ని మోసిన టీడీపీ నేత చమర్తి జగన్ మోహన్ రాజు.
Rajampet: ఆదర్శమూర్తి చమర్తి సుబ్బరాజు కన్నుమూత.. కన్నీటి వీడ్కోలు
రాజంపేట: తండ్రి పార్టీవ దేహాన్ని మోసిన రాజంపేట టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు, ఒక మనిషి జీవితం తన కోసం మాత్రమే కాదు... నలుగురి జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే ఆ జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అలాంటి సార్థక జీవితానికి నిలువెత్తు నిదర్శనం చమర్తి సుబ్బరాజు గారు.
ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వెనుకబాటుతనం విద్యకు అడ్డంకులుగా నిలిచిన రాయచోటి ప్రాంతంలో... విద్యనే అభివృద్ధికి అసలైన ఆయుధంగా భావించి, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. చదువు కొందరికే పరిమితమైన హక్కు కాదు... ప్రతి పేద బిడ్డకు అందాల్సిన అవకాశం అనే అభ్యుదయ భావనతో ఆయన సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
పదవులు, ప్రచారాలు, ప్రశంసల కోసం కాకుండా... సమాజంలో మార్పు రావాలనే తపనతో, భావితరాల భవిష్యత్తు బాగుండాలనే ఆశయంతో ఆయన చేసిన సేవలు అజరామరం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు... కానీ ఆయన వెలిగించిన విద్యాదీపాలు, ఆయన నమ్మిన మానవీయ విలువలు, ఆయన చూపిన అభ్యుదయ మార్గం సమాజానికి ఎప్పటికీ దిక్సూచిగా నిలుస్తాయి.
ఒక మంచి మనిషి నిష్క్రమణ ఒక కుటుంబానికే కాదు... ఆయన సేవలతో ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరికీ తీరని లోటు. చమట్టి సుబ్బరాజు గారి అకాల మరణం రాయలసీమ ప్రాంతానికి, విద్యారంగానికి, అభ్యుదయ భావజాలానికి తీరని విషాదం. మనిషి మరణిస్తాడు... కానీ మానవత్వంతో ఆయన చేసిన సేవలు మరణించవు. వ్యక్తి దూరమవుతాడు... కానీ ఆయన ఆశయాలు తరతరాలకు వెలుగులు పంచుతూనే ఉంటాయి.
ఆదర్శమూర్తి చమర్తి సుబ్బరాజు గారికి అశ్రునివాళులు అర్పిస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
ఎందరికో ఆదర్శంగా నిలిచిన చమర్తి సుబ్బరాజు కన్నీటి చూపు కోసం రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, విద్యా సంస్థల అధినేతలు, స్కూల్ కరస్పాండెట్లు, వ్యాపార ప్రముఖులు, మహిళలు వృద్ధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చివరిసారి గా అంతిమ సంస్కారాల్లో అంతిమ వీడ్కోలు పలకారు...




