Chinnamandem: దేవగుడిపల్లెలో రాహుల్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం
Chinnamandem: చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో జడ్పీటీసీ కూటమి అభ్యర్థి మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి మద్దతుగా రాహుల్ కుమార్ రెడ్డి విస్తృత ఇంటింటి ప్రచారం చేశారు.
Chinnamandem: దేవగుడిపల్లెలో రాహుల్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం
చిన్నమండెం: చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో మండిపల్లి రాహుల్ కుమార్ రెడ్డి గారు విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను, మహిళలను, యువతను కలుసుకుంటూ కూటమి అభ్యర్థికి మద్దతు కోరారు.
రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు, చిన్నమండెం మండలం జడ్పీటీసీ కూటమి అభ్యర్థి మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
చిన్నమండెం మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి ప్రజలంతా తమ మద్దతు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




